లింగాల మునేటి వంతెనను ఎత్తులో నిర్మించాలి : జనసేన మురళి

లింగాల మునేటి వంతెనను ఎత్తులో నిర్మించాలి : జనసేన మురళి

       జగ్గయ్యపేట వత్సవాయి మండలం లింగాల మునేటి వంతెనను జనసేన పార్టీ నాయకులు సందర్శించారు. జగ్గయ్యపేటలో ఉన్నటువంటి రహదారులు మరియు భవనములు శాఖ అధికారులకికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమం లో నియోజకవర్గ సమన్వయ కర్త బాడిశ మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రతి వర్షాకాలంలో ఎగువన కురుస్తున్న కొద్దిపాటి వర్షాలకు కూడా వంతెన దిగువగా ఉండటం వలన వంతెన మునిగిపోయి వాహన రాకపోకలకు అంతరాయము ఏర్పడుతుంది దీని వలన ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం కలుగుతుంది. వర్షాకాలం వచ్చిందంటే స్థానికంగా ఉంటున్న ప్రజలు బయటకు రావాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కున బ్రతకవల్సివస్తుంది కావున అధికారులు సమగ్ర దృష్టి పెట్టి వంతెనను ఎత్తుగా నిర్మించాలని బాడిశ మురళీకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కొర్రపాటి గోపీచంద్, రెంటాల రామారావు, సాయి కిరణ్, నవీన్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

See also  ప్రభుత్వం తుఫాను బాధిత రైతులకు తక్షణం ఆర్థిక సహాయం అందించాలి : నలిశెట్టి శ్రీధర్