తాళ్ల ప్రోద్దటూరులో కోనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు… జనసేన పార్టీ అండగా

తాళ్ల ప్రోద్దటూరులో కోనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు… జనసేన పార్టీ అండగా

       కడప జిల్లా తాళ్ల ప్రోద్దటూరులో కోనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు.  గ్రామంలో పెద్ద ఎత్తున మొహరించిన పోలీసు బలగాలు. ద్వితీయ శ్రేణి నేతలతో పాటు మహిళల నిర్భంధం    చేశారు.  బయటకు రాకుండా బారికేడ్లను ఏర్పాటు చేసిన పోలీసులు.  మహిళా పోలీసులతో గ్రామ మహిళలను నిర్భంధం. ముంపు వాసులను పరామర్శించిన జనసేన నేతలు. అండగా ఉంటామని జనసేన రాయలసీమ పార్లమెంటరీ సంయుక్త కార్యదర్శి సుంకర శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. ప్రభుత్వం దిగి రాకపోతే రంగంలోకి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు హెచ్చరింపు చేశారు. రేపు గండికోట ముంపు వాసులను పరామర్శించి మద్దతు పలికేందుకు రానున్న జనసేన రాష్ట్ర కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ గారు. ఇప్పటికే గండికోట ముంపు వాసుల సమస్యపై స్పందించిన జనసేనాని.. సానుకూలంగా సమస్య పరిష్కరించాలని ప్రభుత్వానికి జనసేనాని పవన్ అల్టిమేటం జారీ చేశారు. స్వంత జిల్లాలోని ముంపువాసులపై దౌర్జన్యం చేయడం తగదు అని అన్నారు. బాధితులకు న్యాయం చేశాకే ముందుకెళ్లాలని సూచన చేశారు. కూల్చేస్తారేమోనని భయాందోళన వ్యక్తం చేసిన తాళ్ల ప్రోద్దటూరు గ్రామస్తులు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ మండల కన్వీనర్ శేఖర్ రెడ్డి గారు మరియు జనసేన కార్యదర్శలు మాలే శివ, సురేష్ బాబు, తోట బాలసుబ్రహ్మణ్యం, నాగరాజు‌, సందీప్,  బీజేపీ నాయకులు, జనసైనికులు, తదితరులు పాల్గొన్నారు. 

See also  జనసేనపార్టీ క్రియాశీలక సభ్యుడి కుటుంబానికి రూ.5 లక్షల బీమా చెక్కును అందించిన శ్రీ నాదెండ్ల మనోహర్ గారు