
హరిదాసుపురంలో టెక్కలి జనసేన ఇంచార్జ్ కణితి కిరణ్ పర్యటన
నందిగాము మండలం హరిదాసుపురం గ్రామంలో జనసేన టెక్కలి ఇంచార్జి కణితి కిరణ్, బీజేపీ నాయకుడు అట్టడా రాజేష్ తో పర్యటించారు. గ్రామంలో ఇటీవల కాలంలో మరణించిన కణితి మాకన్న గారి కుటుంబసభ్యులను పరామర్శించి ఆయన కుమారుడు తులసిరావు గారిని కలసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అదే గ్రామానికి చెందిన కణితి రంగారావు గారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుమారులను కలుసుకున్నారు. అలాగే గ్రామస్థులు తన దృష్టికి తీసుకు వచ్చిన కౌలు రైతుల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానని గ్రామస్థులకు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కణితికిరణ్ తో పాటు హరిదాసుపురం పెద్దలు వెంకటబాబు గారు, కంచరాన అప్పలస్వామి, కవిటి ఖగ రాజు మరియు ఇతర జనసైనికులు పాల్గొన్నారు.








