అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోండి – మార్కెట్ యార్డ్ చైర్మన్ పూల శివప్రసాద్

నల్లమాడ, డిసెంబర్ 2, (జనస్వరం) : నల్లమాడ మండలంలో నూతనంగా నిర్మించిన మార్కెట్ యార్డ్ సమీప ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లుగా సమాచారం అందడంతో మార్కెట్ యార్డ్ చైర్మన్ పూల శివప్రసాద్ జనసైనికులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. పరిశీలనలో వందల ఎకరాల విస్తీర్ణంలో అనుమతులు లేకుండా మైనింగ్ కొనసాగుతున్నట్టు వెల్లడైంది. అక్కడ పనిచేస్తున్న వారిని అనుమతుల గురించి ప్రశ్నించగా వారు ఎటువంటి పత్రాలు చూపించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా ఎదురు తిరిగినట్లు తెలిపారు. ఈ విషయంపై నల్లమడ తాసిల్దార్‌తో పాటు మైనింగ్ అధికారులకు సమాచారం అందించగా, సంబంధిత ప్రాంతానికి కేవలం ఒక హెక్టార్ పరిధిలో మాత్రమే అనుమతి ఉందని అధికారులు స్పష్టం చేశారు. అయితే, అనుమతి ఉన్న విస్తీర్ణానికి దాదాపు వంద రెట్లు ఎక్కువ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. వ్యవహారంపై సమగ్రమైన విచారణ చేపట్టి నిజానిజాలను బయటపెట్టాలని మైనింగ్ శాఖ అధికారులతో పాటు జిల్లా అధికారులను మార్కెట్ యార్డ్ చైర్మన్ పూల శివప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పూల శివప్రసాద్, నల్లమడ మండల కన్వీనర్ బడిసం మహేష్, ఓడిసి మండల కన్వీనర్ మేకల ఈశ్వర్, టౌన్ జనరల్ సెక్రటరీ ఎస్ రాము, సెక్రటరీ ముత్యాల కరుణాకర్, నాయకులు ప్రభాకర్, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

See also  స్వేద౦ చిందించి నేలపై బంగారు పండించే రైతన్నకు వందనాలు : వాసగిరి మణికంఠ