తెలుగు వారి ఆత్మగౌరవంగా నిలిచిన తెలుగుదేశం పార్టీ

– టిడిపి 44వ ఆవిర్భావ దినోత్సవంలో టిడిపి నాయకులు

కిర్లంపూడి, మార్చి 29 (జనస్వరం) : పేదలకు కూడు, గుడ్డ, నీడ కల్పించిన ఘనత స్వర్గీయ ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకే దక్కుతుందని టీడీపీ మండల అధ్యక్షుడు వీరంరెడ్డి కాశీబాబు అన్నారు. కిర్లంపూడిలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా టీడీపీ నాయకుడు తూము కుమార్, కిర్లంపూడి సొసైటీ చైర్మన్ కుర్ల చినబాబు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల అధ్యక్షుడు వీరంరెడ్డి కాశీబాబు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు పట్టెడన్నం అందించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన రాజకీయాలపై గ్రామీణ ప్రజల్లో అవగాహన కల్పించారని, ప్రజల మధ్య రాజకీయ చైతన్యం పెంపొందించడంలో ఆయన పాత్ర కీలకమని అన్నారు. కార్యక్రమంలో ఏలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ బస్వా వీరబాబు, ఎంపీపీ తోట రవి, వీరవరం సొసైటీ చైర్మన్ తోట గాంధీ, నియోజకవర్గ అభివృద్ధి కమిటీ సభ్యుడు భూపాలపట్నం ప్రసాద్, జిల్లా టీడీపీ సభ్యుడు చదరం చంటిబాబు, సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు, గొడె దొరబాబు, గంధం ఈశ్వరరావు, జ్యోతుల రాంబాబు, మంచిగంటి శ్రీను, జంపన రవివర్మ, కాళ్ల వెంకటేష్, పాటంశెట్టి మురళీకృష్ణ, సర్పంచ్ పట్టు చంటిబాబు, ఉప సర్పంచ్ బొజ్జపు శ్రీను, ఎంపీటీసీ గరగ గోవిందు, ఆళ్ల బాబులు, అనుకుల శ్రీకాంత్, గొడె బాల, సూతి శ్రీను, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ గౌత్ చిన్న బూరయ్య, గండే చల్లారావు, కాకిలేటి బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

See also  పుట్టపర్తి అభివృద్ధికి 30 కోట్లు మంజూరు చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు