
కడప నగరంలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించిన జనసేన కడప ఇంచార్జ్ సుంకర శ్రీనివాస్
ముంపు ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని 500 మందికి భోజన సదుపాయం కల్గించిన సుంకర శ్రీనివాస్ గారు. వైసీపీ నేతలకు సంబరాల పై ఉన్నంత ప్రేమ ప్రజా సమస్యల పై లేదని ఆయన ధ్వజమెత్తారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ఉంటే ఇంత నష్టం జరిగేది కాదు. బుగ్గవంక రక్షణ గోడ నిర్మించి ఉంటే ఇంత ఆస్తి నష్టం జరిగేది కాదు. వైసీపీ నేతలు మాటలకే పరిమితం అయ్యారు. ముందస్తు హెచ్చరికలు లేకుండా గేట్లు లిఫ్ట్ చేయడం వల్లే కొన్ని ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. తుఫాను చర్యల్లో అధికారులు, వైసీపీ నేతలు పూర్తిగా విఫలం అయ్యారు. నష్ట పరిహారం వెంటనే చెల్లించాలి లేని పక్షంలో జనసేన ప్రజల తరపున పోరాటాలకు సిద్ధం అవుతుంది. ముంపు ప్రాంతాల్లో కనీస సహాయక చర్యలు చేపట్టలేదు. ముంపు ప్రాంతాల్లో నష్ట పోయిన వారందరికీ 20 వేల రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలి. కొంత మంది ఇళ్ళు కూలిపోయి పూర్తిగా రోడ్డున పడ్డారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మాలేశివ, సుంకర ప్రసాద్, మల్లి, సాయి లోకేష్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.








