శ్రీకాళహస్తి పట్టణ, తొట్టంబేడు జనసేన మండల కమిటీలో స్థానం కల్పిస్తూ పదవులు

శ్రీకాళహస్తి

      శ్రీకాళహస్తి ( జనస్వరం ) : జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు  పసుపులేటి హరి ప్రసాద్ ఆమోదంతో శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి వినుత కోటా క్రియాశీలకంగా పని చేస్తున్న జనసైనికులకు శ్రీకాళహస్తి పట్టణ, తొట్టంబేడు మండల కమిటీలో స్థానం కల్పిస్తూ పదవులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక పట్టణ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి నూతనంగా నియమితులైన నాయకులకు నియామక పత్రాలను అందించడం జరిగింది. శ్రీకాళహస్తి పట్టణ ఉపాద్యక్షులుగా తోట గణేష్, పట్టణ ప్రధాన కార్యదర్శిగా పేట చిరంజీవి, బలిపాకు ఉదయ్ కుమార్, తొట్టంబేడు మండల ప్రధాన కార్యదర్శిగా పేట చంద్ర శేఖర్ నియమించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం కొరకు క్రమశిక్షణతో కృషి చెయ్యాలని ప్రతి ఒక్కరికీ దిశ నిర్దేశం చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, తొట్టంబేడు మండల అధ్యక్షులు కొప్పల, నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ కావలి శివ కుమార్, నాయకులు నితీష్ కుమార్, వెంకట రమణ యాదవ్, గురవయ్య, జనసైనికులు పాల్గొన్నారు.

See also  పట్టాలు ఇచ్చారు... స్థలాలు ఎక్కడ? : పాటంశెట్టి సూర్యచంద్ర