
మైలవరంలో జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం
మైలవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలంలోని జక్కంపూడి షాబాధ్ గ్రామంలోజనసేన పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశం ఎజెండా గా నూతన గ్రామ కమిటీలను ఎన్నుకోవడం మరియు గ్రామ సమస్యలు గూర్చి చర్చించడం. వచ్చే స్థానిక ఎన్నికలో జనసేన పార్టీని గ్రామాలలో జనసేన జెండా ఎగురవేయాలని బలంగా నిశ్చయించుకున్నారు. ఈ సమావేశానికి అధికార ప్రతినిధి మరియు మైలవరం నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ అక్కల రామెహనరావు( గాంధీ) గారు మరియు విజయవాడ రూరల్ మండల జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగినది. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపారు.








