వాల్మీకి మహర్షి జయంతి సందర్బంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన శింగనమల జనసేన నాయకులు సాకే మురళి కృష్ణ

    శింగనమల, (జనస్వరం) : వాల్మీకి మహర్షి జయంతి సందర్బంగా బుక్కరాయసముద్రంలోని వాల్మీకి మహర్షి విగ్రహానికి  శింగనమల నియోజకవర్గం నాయకులు సాకే మురళీకృష్ణ పూలమాలలతో సత్కరించి టెంకాయ కర్పూరంతో పూజించటం జరిగింది. ఈ వాల్మీకి మహర్షి పుట్టినరోజును ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించి, కుటుంబ విలువలకు చిహ్నంగా రామాయణం అనే మహా కావ్యాన్ని తెలిపి పండుగలా ఈ పర్వదినాన్ని జరుపుకోవాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. వ్యవస్థ సక్రమంగా పని చేయాలన్న అహంకారం, దౌర్జన్యం, దుర్మార్గం నశించాలన్న మనకు ఈ వాల్మీకి మహర్షి పండుగ చాలా అవసరమని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి చొప్ప చంద్రశేఖర్, మన్నల పెద్దిరాజు, వాల్మీకి మునీంద్ర, వాల్మీకి రామకృష్ణ, తలారి ధనుంజయ, వాల్మీకి రాజు, తాహిర్, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.

See also  జగణాసుర పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకొందాం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి