షణ్ముఖ వ్యూహం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం

షణ్ముఖ వ్యూహం

           విజయనగరం ( జనస్వరం ) : జనంలోకి జనసేన ప్రజా సమస్యలపై పోరాటం కార్యక్రమం జనసేన నియోజకవర్గ సీనియర్ నాయకులు  మార్రపు సురేష్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఆయన మాట్లాడుతూ గజపతినగరం నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి వెళ్లి జనసేన పార్టీ సిద్ధాంతాలు, జనసేన పార్టీ అధికారంలోకి రాగానే చేసే కార్యక్రమాలు వివరించడం జరుగుతుందన్నారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా ప్రజల్ని ఇబ్బందికి గురి చేస్తుందని, అలాగే జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏ విధంగా ప్రజల్ని మేలు జరుగుతుందో వివరిస్తామన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఆయన సిద్ధాంతాలు వివరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మోహన్ రావు, మిడతాన రవికుమార్, పండు, శ్రీను, హరీష్, ఆదినారాయణ, రాజీవ్, డొల రాజేంద్ర, మహేష్, రవీంద్ర, నాయుడు జనసైనికులు పాల్గొన్నారు. 

See also  జనసేన NRI సేవా సమితి కువైట్ ‌సేవలు అభినందనీయం : ముకరం చాంద్ గారు, తాత౦శెట్టి నాగేంద్ర గారు