
ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చెయ్యండి : రైల్వే కోడూరు జనసేన నాయకులు
నివర్ తుఫాను కారణంగా రైల్వేకోడూరు చుట్టూ ప్రవహిస్తున్న ఏరులు పొంగి పొరలి ప్రవహించి అక్కడక్కడ సుడిగుండాలు ఏర్పడి ఖచ్చితమైన లోతు తెలియని గుంతలు నీటితో నిండి ఉన్నాయి. ఈ మధ్య వరుస ఘటనలలో ఇద్దరూ యువకులు ప్రాణాలను కోల్పోవడం జరిగింది. గతంలో ఇష్టానుసారంగా నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను అక్రమంగా తరిలించారు. అవి కాస్త ఇప్పుడు మృత్యుకూహరాలు లా మారి పిల్లల ప్రాణాలు నీ బలి తీసుకుంటున్నాయి. కావునా జరగాల్సిన నష్టం జరిగిపోయాక నష్ట నివారణ చర్యలను చేపట్టడం అంటే ముందస్తుగా ప్రమాదాలను నివారించేందుకు ప్రమాద స్థలాలను గుర్తించి బోర్డులను ఏర్పాటు చేయవలసిందిగా డిప్యూటీ మండల రెవెన్యూ అధికారి అయినా శివరాం గారికి జనసేన పార్టీ కార్యకర్తలు వినతిపత్రాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేనపార్టీ కార్యకర్తలు మర్రి రెడ్డి ప్రసాద్, దళిత నాయకులు మహేష్. నగిరిపాటీ, పవనిజం హేమంత్, బాల శెట్టి వెంకీ తదితరులు పాల్గొన్నారు.








