ఆశా వర్కర్లను హౌస్ అరెస్ట్ చేసిన గ్రామీణ పోలీసులు

భైంసా, మార్చి 30 (జనస్వరం) : ఆశా వర్కర్లు తమ సమస్యలపై నిర్మల్ జిల్లాలో ధర్నాకు వెళ్లే నేపథ్యంలో, వారిని ధర్నాకు వెళ్లనీయకుండా గ్రామీణ ఎస్సై సుప్రియ హౌస్ అరెస్ట్ చేశారు. గౌరవ వేతనం రూ.18 వేలు ఇవ్వాలని, అలాగే ఎన్నికల డ్యూటీ చేసిన డబ్బులు, పల్స్ పోలియో, లెప్రసీ కార్యక్రమాల బకాయిలు చెల్లించే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు విజయ తెలిపారు. ఇందిరమ్మ పాలనలో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని వారు పేర్కొన్నారు.

See also  గ్రూప్-2 అభ్యర్థులకు సువర్ణావకాశం