
అగ్ని ప్రమాదానికి గురైన కుటుంబానికి రూ.24,216 ఆర్థిక సహాయం చేసిన మోపిదేవి మండల జనసైనికులు
కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలోని కోసూరువారిపాలెం గ్రామంలో గత 6 రోజులు క్రితం జరిగిన అగ్నిప్రమాదంలో గరికిపాటి వెంకటేశ్వరరావు గారి గృహం పూర్తిగా దగ్ధమై కుటుంబ సభ్యులు కట్టుబట్టలతో బయటకు వచ్చారు . ఈ ఘటన తెలుసుకున్న మోపిదేవి మండల జనసేన పార్టీ వారు గత 5 రోజులు నుండి దాతలు నుండి సహాయం కోరగా ఇందుకు అధినేత పవన్ కళ్యాణ్ స్పూర్తితో ముందుగా స్పందించి నియోజకవర్గ NRI శ్రీ బొండడా రాగేష్ 5000 మరియు IT టీం బెంగళూరు జనసేన వారు 3000 అలాగే నియోజకవర్గ జనసేన కార్యకర్తలు మరియు మోపిదేవి మండల జనసేన కార్యకర్తలు సహాయం మొత్తం 24,216 రూపాయలను లను బాధిత కుటుంబానికి అందచేశారు. ఈ కార్యక్రమంలో మోపిదేవి మండల జనసేన నాయకులు నెరుసు కృష్ణ ఆంజనేయులు, రేపల్లె సీతారామాంజనేయులు, అర్జా రాధిక , భోగిరెడ్డి సాంబశివరావు, బాదర్ల లోలాక్షి, కలపాల ప్రసాద్ , కూరేటి రాఘవ , అర్జా కాంత్ , ఆకుల పవన్ , కోసూరు సీతారామాంజనేయులు, కూరేటి జగన్ , కోసూరు అన్వేష్, సోమిశెట్టి దిలీప్ , సనకా ప్రదీప్, గరికిపాటి శ్రీను , కోసూరు ఆంజనేయులు తదితర జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.









