
అనంతపురం, ఏప్రిల్ 5 (జనస్వరం) : మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా స్థానిక జిల్లా పరిషత్ ప్రాంగణంలో ఉన్న ఆయన విగ్రహానికి మాదిగ సంక్షేమ సేవా సంఘం (MSSS) ఆధ్వర్యంలో పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాకే రామతీర్థ, జిల్లా అధ్యక్షుడు మన్నల సుబ్రమణ్యం, జిల్లా ఉపాధ్యక్షులు ఎక్కలూరి నాగరాజు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి మహాత్మ పూలే చేసిన సేవలు అపారమని కొనియాడారు. రిజర్వేషన్లకు పునాది వేసిన మహానేతగా ఆయనను గుర్తుచేస్తూ, ఆయన ఆశయాలను కొనసాగిస్తూ సామాజిక న్యాయం కోసం కృషి చేస్తామని తెలిపారు. పూలే ఆలోచనలను సమాజంలో అమలు చేసి వెనుకబడిన వర్గాలకు నూతన చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కోటంగ మల్లేష్, ధనుంజయ, రాణా ప్రతాప్, గూడూరు చంటి, ప్రసాద్, నరేష్, మధు తదితరులు పాల్గొన్నారు.








