Logo
Date of Publish : 11 April 2026, 5:16 pm
Editor : Sake Naresh

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఘన నివాళులు : MSSS సంఘం

అనంతపురం, ఏప్రిల్ 5 (జనస్వరం) : మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా స్థానిక జిల్లా పరిషత్ ప్రాంగణంలో ఉన్న ఆయన విగ్రహానికి మాదిగ సంక్షేమ సేవా సంఘం (MSSS) ఆధ్వర్యంలో పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాకే రామతీర్థ, జిల్లా అధ్యక్షుడు మన్నల సుబ్రమణ్యం, జిల్లా ఉపాధ్యక్షులు ఎక్కలూరి నాగరాజు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి మహాత్మ పూలే చేసిన సేవలు అపారమని కొనియాడారు. రిజర్వేషన్లకు పునాది వేసిన మహానేతగా ఆయనను గుర్తుచేస్తూ, ఆయన ఆశయాలను కొనసాగిస్తూ సామాజిక న్యాయం కోసం కృషి చేస్తామని తెలిపారు. పూలే ఆలోచనలను సమాజంలో అమలు చేసి వెనుకబడిన వర్గాలకు నూతన చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  కోటంగ మల్లేష్, ధనుంజయ, రాణా ప్రతాప్, గూడూరు చంటి, ప్రసాద్, నరేష్, మధు తదితరులు పాల్గొన్నారు.

 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com