పర్సనల్ డిపార్ట్మెంట్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం

సింగరేణి, మార్చి 28 (జనస్వరం) : సింగరేణి ప్రధాన కార్యాలయం జీఎం (పర్సనల్) వెల్ఫేర్ & సిఎస్‌ఆర్ ఛాంబర్ నుండి జనరల్ మేనేజర్ (పర్సనల్) వెల్ఫేర్ & సిఎస్‌ఆర్ జి.వి. కిరణ్ కుమార్ శనివారం అన్ని ఏరియాల పర్సనల్ డిపార్ట్మెంట్ అధిపతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏరియా వారీగా పర్సనల్ డిపార్ట్మెంట్ అధికారులతో కారుణ్య నియామకాలు, టెర్మినల్ బెనిఫిట్స్ చెల్లింపుల ప్రక్రియలపై సమీక్షించి, ఉద్యోగులకు సంబంధించిన టెర్మినల్ బెనిఫిట్స్ చెల్లింపులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన అంశాలలో ఎటువంటి జాప్యం లేకుండా నిబంధనల ప్రకారం త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను గుర్తించి వాటిని త్వరగా పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. కారుణ్య నియామకాల ప్రక్రియ పారదర్శకంగా మరియు వేగవంతంగా కొనసాగాలని పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించడం ద్వారా సంస్థపై నమ్మకం పెంపొందించాలన్నారు. ప్రతి ఏరియాలో పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జి.వి. కిరణ్ కుమార్‌తో పాటు డీజీఎం (పర్సనల్)లు కేసా నారాయణరావు, ముకుంద సత్యనారాయణ, సీనియర్ పీఓ ఎం. శ్రీనివాస్, కమ్యూనికేషన్ ఆఫీసర్ ఎన్. సుజ్ఞాన్, వెల్ఫేర్ పీఏ కె. వరప్రసాద్ రావు మరియు అన్ని ఏరియాల పర్సనల్ డిపార్ట్మెంట్ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.

See also  వాకతిప్ప, ఉప్పాడ పాఠశాలల్లో మెగా పేరెంట్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న రావు అక్షయ్