గుంతకల్లు నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

   గుంతకల్లు, (జనస్వరం) :  73 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి  జనసేన పార్టీ అనంతపురం జిల్లా కార్యదర్శి శ్రీ వాసగిరి మణికంఠ గారు భరతమాత, జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలకు పూల మాల వేసి నివాళులర్పించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి జనసైనికులు ఆధ్వర్యంలో గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వేచ్ఛాయుత భారతంలో అభివృద్ధి అన్ని వర్గాలకు చేరువ కావాలని, రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించేలా ప్రజలందరూ భాద్యత తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుంతకల్లు మండలం అధ్యక్షులు కురుబ పురుషోత్తం, బోయ సురేష్, పూల ఎర్రిస్వామి, బండి శేఖర్, పవర్ శేఖర్, పాండు కుమార్, పామయ్య, ఆటో రామకృష్ణ, శివ, మంజు, రాజశేఖర్, రామకృష్ణ, అనిల్, మల్లికార్జున, పాత గుంతకల్ అనిల్ లతో పాటు పలువురు నాయకులు, నిస్వార్థ జనసైనికులు, అభిమానులు పాల్గొన్నారు.

See also  జనసేనను గెలిపిస్తే నెల్లిమర్ల నియోజకవర్గంలో పారిశ్రామిక అభివృద్ధి