తొలగించిన భారతమాత విగ్రహాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి : జనసేన నాయకుడు చెంగారి శివప్రసాద్‌

భారతమాత

      రాజంపేట, (జనస్వరం) : తాడేపల్లిలో తొలగించిన భారతమాత విగ్రహాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని జనసేన నాయకుడు చెంగారి శివప్రసాద్‌ గారు డిమాండ్‌ చేశారు. జనసేన అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌  గారు 75 వ స్వాతంత్ర్యం దినోత్సవం రోజున జనసేన నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ మనం ముందు దేశాన్ని గౌరవిద్దాము, తరువాత జనసేన పార్టీ అన్నట్టుగా తెలియజేశారని జనసేన నాయకులకు గుర్తు చేశారు. ఇకనైనా రాష్ట్ర ప్రజలు ఆలోచించుకొని సరియైన నాయకున్ని ఎన్నుకోవాలని వారు కోరారు. జననాయకుడు పవన్‌ కళ్యాణ్‌ గారు ఒక్కరే అని తెలిపారు. తొలగించిన భారతమాత విగ్రహాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని జనసేన పార్దీ తరపున చెంగారి శివప్రసాద్‌ గారు కోరారు.

See also  దర్శిలో జనసేనాని జన్మదిన వేడుకలలో వికలాంగురాలకు కుట్టు మిషన్ అందించిన జనసైనికులు