క్రియాశీలక సభ్యత్వ నమోదుకు ప్రజల్లో ఆదరణ

క్రియాశీలక

        విజయవాడ, (జనస్వరం) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ ఆదేశాల మేరకు స్థానిక 51వ డివిజన్లో డివిజన్ అధ్యక్షులు బత్తుల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో శని ఆదివారాల్లో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీకి ప్రజల్లో ఆదరణ లభిస్తుందన్నారు. జనసేన పార్టీ పై ప్రజల్లో మంచి ఆలోచన ప్రారంభమైందని రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ విజయమే లక్ష్యంగా నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ అధ్యక్షులు కమిటీ సభ్యులు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిళ్ళా శివ, సాయి నాగోతి, నవీన్, సాయి కళ్యాణ్, బత్తుల రాము తదితరులు పాల్గొన్నారు

See also  కొట్టే వారి ప్రచార రధాలు... జనసేన విజయ రధాలు