
వంశధార శివారు భూములకు నీరు అందించండి : జనసేన కణితి కిరణ్
టెక్కలి జనసేన ఇంచార్జి కణితి కిరణ్ వంశధార ఈఈ శేఖర్ గారిని ఆయన ఆఫీస్ లో కలసి వంశధార కాలువ నీరు అందకపోవడం వలన రైతులు పడుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సమస్యలపై స్పందించి కాలువ శివారు భూములకు వెంటనే నీటిని విడుదల చేయమని కోరడం జరిగినది. వర్ష పాతం పై ఆధారపడే టెక్కలి నియోజక వర్గ రైతులకు ఈ ఏడాది వర్షాభావం వల్ల వేసిన పంటలు ఎండిపోతున్నాయని, అక్కడక్కడ ట్యాంకర్లుతో పంటను నడుపుతున్నారని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈఈ గారు స్పందిస్తూ మరో 4 రోజుల్లో మరింత నీటిని విడుదల చేస్తామని చెప్పారు. రైతు పక్షపాతినని చెప్పుకొనే ఈ ప్రభుత్వము ఆగస్ట్ నెల చివర వరకు నీటిని అందించలేక పోవడం ఇది ప్రభుత్వ వైఫల్యమే అవుతుందని కణితి కిరణ్ అన్నారు. లష్కర్ వ్యవస్థలను ఈ ప్రభుత్వం ఉపయోగించక పోవడం కూడా ప్రభుత్వ వైఫల్యంగా కిరణ్ అన్నారు. శివారు భూములకు వెంటనే తగినంత నీరు విడుదల చేయక పోతే రైతుల తరపున టెక్కలి జనసేన పార్టీ ధర్నాకు దిగుతామని కణితి కిరణ్ ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకుడు నర్సిపురం శేఖర్, హరి, సాయి పాల్గొన్నారు.









