కల్యాణ మండపం సమస్య పరిష్కరించాలి : పెందుర్తి నియోజకవర్గ జనసేన నాయకులు

పెందుర్తి

      విశాఖపట్నం, (జనస్వరం) :  జీవీఎంసీ 88వ వార్డు నరవ గ్రామంలో సమస్యలు పరిష్కరించాలని పెందుర్తి నియోజకవర్గ జనసేన నాయకులు వబ్చిన జనార్దన, శ్రీకాంత్‌ జీవిఎంసీ కమిషనర్‌ సృజను కలిసి వినతిపత్రం అందించారు. వార్డు సమన్యలను ఆమెకు వివరించారు. నరవ గ్రామంలో ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న కల్యాణ మండపాన్ని గత ఏడాది సచివాలయంగా మార్చు చేశారని తెలిపారు. దీనిపై గ్రామస్థుందరూ స్థానిక నాయకులకు, అధికారులకు కల్యాణ మండపాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారని తెలిపారు. దీనిపై అధికారులు సచివాలయం వేరే ప్రదేశానికి మారుస్తామని హామీ ఇచ్చారని, అయితే ఇప్పటివరకూ కల్యాణ మండపం ప్రజలకు అందుబాటులో రాలేదని తెలిపారు. ఇప్పటికైనా సచివాలయాన్ని వేరే చోటకు మార్చి కల్యాణ మండపాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. దీనిపై కమిషనర్‌ స్పందించి సమస్య పరిష్కరిస్తానని, కల్యాణ మండప మరమ్మతులకు జడ్సీకి, సంబంధిత అధికారులను ఆదేశిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా నాయకులు బీశెట్టి గోపి కృష్ణ, పార్టీ నరవ నాయకుడు మహాలక్షి నాయుడు పాల్గొన్నారు.

See also  చింతలపూడిలో జనంలోకి జనసేన – జనసేనలోకి జనం కార్యక్రమం