
హిందూ స్మశాన వాటికకు స్థలాన్ని కేటాయించండి : జనసేన కదిరి ఇంఛార్జ్ భైరవ ప్రసాద్
జనసేన పార్టీ కదిరి టౌన్ నందు ఇంతవరకు హిందువులకు స్మశాన వాటికకు స్థలం లేనందున ఎవరైనా హిందూ కుటుంబంలో చనిపోయిన యెడల వారిని రోడ్డు పక్కనే అంత్యక్రియలు చేయాల్సి వస్తుంది. దీనివల్ల రోడ్డు వెడల్పు జరిగినప్పుడు వాటిని తీసివేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయంలో కదిరి జనసేన పార్టీ ఆధ్వర్యంలో గతంలో 2018 సంవత్సరంలో 2019 సంవత్సరంలో వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. కానీ, ఇంతవరకు దానిమీద ఎటువంటి చర్య తీసుకోలేదు .అందువల్ల మళ్లీ ఈ రోజు కదిరి తహసీల్దార్ గారికి హిందూ స్మశాన వాటిక కోసం
స్థలం కేటాయించాలని ఎమ్మార్వో కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్ శ్రీ ముకుందా గారికి జనసేన పార్టీ కదిరి ఇంచార్జ్ భైరవ ప్రసాద్ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించినారు. భైరవ ప్రసాద్ గారు మాట్లాడుతూ స్మశాన వాటిక స్థలాన్ని కేటాయించకపోతే తప్పకుండా లాక్ డౌన్ అయిపోయిన వెంటనే రోడ్డు పైకి వచ్చి నిరసన తెలియజేస్తామని తెలియజేశారు. గతంలో పలుమార్లు అధికారులకు ఈ విషయమై విన్నవించినా ఎలాంటి స్పందన లేదు. ప్రభుత్వం చొరవ తీసుకొని హిందూ శ్మశాన వాటికకు స్థలాన్ని కేటాయించకపోతే జనసేన పార్టీ తరుపున మరింత పోరాడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో కదిరి టౌన్ జనసేన అధ్యక్షులు చలపతి , అడ్వకేట్ రవీంద్ర, అంజిబాబు, లక్ష్మణ్ కుటాల, ఈటి లోకేష్, వంశి, హరీష్, మహేష్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.









