జనసేన నాయకులపై బెదరింపులను నిరసిస్తూ…విడవలూరు పోలీసులకు ఫిర్యాదు

జనసేన నాయకులపై బెదరింపులను నిరసిస్తూ…విడవలూరు పోలీసులకు ఫిర్యాదు

                            స్థానిక సమస్యలపై గళం విప్పండి అంటూ మనుక్రాంత్ గారి పిలుపు మేరకు డాక్టర్అ జయ్, గునుకులకిషోర్ కలెక్టరు గారికి రామతీర్దం నీటి సమస్య పై ఇచ్చిన అర్జీ పై స్థానిక వాటర్ ప్లాంటు యజమానుల దుర్బాషలాడుతూ విడవలూరు పోలీసుల కు ఫిర్యాదు…. రామతీర్ధం గ్రామంలో ఉప్పునీటి సమస్యమీద సెప్టంబర్ 2 వ తేదీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్బంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ సమస్యమీద కలెక్టర్ గారు పెద్దమనస్సుతో తక్షణమే స్పందించి 24 గంటలు తిరిగేలోపు జిల్లాకు సంబందించిన RWS అధికారులను రామతీర్థ గ్రామానికి పంపించి నివేదికను కోరడం జరిగింది.. గ్రామాన్ని సందర్శించిన అధికారులు గ్రామంలో సమస్యను పర్యవేక్షించి అతిత్వరలో సమస్యను పరిష్కరిస్తామని తెలిపుతూ కలెక్టర్ గారికి నివేదికను సమర్పించారు. గ్రామానికి వచ్చిన అధికారులు బయలుదేరిన వెంటనే ఆప్రాంతంలో నీటిని అమ్ముతున్న ప్రవైట్ వాటర్ ప్లాంటు యజమాని ఫిర్యాదు చేసిన డా అజయ్ కుమార్ గారి తండ్రికి , మరియు కుటుంబసభ్యులకు ఫోన్ చేసి బెదిరింపులు ప్రారంభించినారు. రామతీర్థం గ్రామంలో ఉప్పునీటి సమస్య పరిష్కారం అయితే అతని వ్యాపారం దెబ్బతింటుందని మీడియాలో చెప్పలేని భాషతో తిడుతూ వేదిస్తున్నారు. ఆ విషయం మీద ఈ రోజు పోలీసు వ్యవస్థ మీద గౌరవంతో మాకు న్యాయం చేయమని విడవలూరు సబ్ ఇన్స్పెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి గురించి గ్రామంలో విచారించగా, అతను నీటిని అమ్ముతున్న వాటర్ ప్లాంటుకు ఎటువంటి అనుమతులు లేవని గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ యొక్క వాటర్ ప్లాంట్ ని వెంటనే రద్దుచేయాలని జనసేనపార్టీ డిమాండ్ చేస్తుంది. ఇటీవల గ్రామంలో ప్రభుత్వ పంచాయితీ కార్యాలయాన్ని ఎటువంటి ప్రభుత్వ అధికారుల అనుమతి లేకుండా ప్రొక్లెయిన్ తో ద్వంసం చేయడం గ్రామస్తుల అందరి దగ్గర వీడియోల రూపంలో ఆధారాలు ఉన్నాయి. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి వీటిమీద చర్యలు తీసుకోవాలని జనసేనపార్టీ డిమాండ్ చేస్తుంది అని జనసేన నాయకులు గునుకుల కిషోర్ అన్నారు. 

See also  పార్లమెంట్ లో కిసాన్ క్రెడిట్ కార్డులపై ప్ర‌శ్నించి ఎంపీ కేశినేని శివ‌నాథ్