Logo
Date of Publish : 07 September 2020, 10:49 am
Editor : Sake Naresh

జనసేన నాయకులపై బెదరింపులను నిరసిస్తూ…విడవలూరు పోలీసులకు ఫిర్యాదు

జనసేన నాయకులపై బెదరింపులను నిరసిస్తూ...విడవలూరు పోలీసులకు ఫిర్యాదు

                            స్థానిక సమస్యలపై గళం విప్పండి అంటూ మనుక్రాంత్ గారి పిలుపు మేరకు డాక్టర్అ జయ్, గునుకులకిషోర్ కలెక్టరు గారికి రామతీర్దం నీటి సమస్య పై ఇచ్చిన అర్జీ పై స్థానిక వాటర్ ప్లాంటు యజమానుల దుర్బాషలాడుతూ విడవలూరు పోలీసుల కు ఫిర్యాదు.... రామతీర్ధం గ్రామంలో ఉప్పునీటి సమస్యమీద సెప్టంబర్ 2 వ తేదీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్బంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ సమస్యమీద కలెక్టర్ గారు పెద్దమనస్సుతో తక్షణమే స్పందించి 24 గంటలు తిరిగేలోపు జిల్లాకు సంబందించిన RWS అధికారులను రామతీర్థ గ్రామానికి పంపించి నివేదికను కోరడం జరిగింది.. గ్రామాన్ని సందర్శించిన అధికారులు గ్రామంలో సమస్యను పర్యవేక్షించి అతిత్వరలో సమస్యను పరిష్కరిస్తామని తెలిపుతూ కలెక్టర్ గారికి నివేదికను సమర్పించారు. గ్రామానికి వచ్చిన అధికారులు బయలుదేరిన వెంటనే ఆప్రాంతంలో నీటిని అమ్ముతున్న ప్రవైట్ వాటర్ ప్లాంటు యజమాని ఫిర్యాదు చేసిన డా అజయ్ కుమార్ గారి తండ్రికి , మరియు కుటుంబసభ్యులకు ఫోన్ చేసి బెదిరింపులు ప్రారంభించినారు. రామతీర్థం గ్రామంలో ఉప్పునీటి సమస్య పరిష్కారం అయితే అతని వ్యాపారం దెబ్బతింటుందని మీడియాలో చెప్పలేని భాషతో తిడుతూ వేదిస్తున్నారు. ఆ విషయం మీద ఈ రోజు పోలీసు వ్యవస్థ మీద గౌరవంతో మాకు న్యాయం చేయమని విడవలూరు సబ్ ఇన్స్పెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి గురించి గ్రామంలో విచారించగా, అతను నీటిని అమ్ముతున్న వాటర్ ప్లాంటుకు ఎటువంటి అనుమతులు లేవని గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ యొక్క వాటర్ ప్లాంట్ ని వెంటనే రద్దుచేయాలని జనసేనపార్టీ డిమాండ్ చేస్తుంది. ఇటీవల గ్రామంలో ప్రభుత్వ పంచాయితీ కార్యాలయాన్ని ఎటువంటి ప్రభుత్వ అధికారుల అనుమతి లేకుండా ప్రొక్లెయిన్ తో ద్వంసం చేయడం గ్రామస్తుల అందరి దగ్గర వీడియోల రూపంలో ఆధారాలు ఉన్నాయి. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి వీటిమీద చర్యలు తీసుకోవాలని జనసేనపార్టీ డిమాండ్ చేస్తుంది అని జనసేన నాయకులు గునుకుల కిషోర్ అన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com