కొత్తపల్లి కుటుంబానికి ప్రముఖుల పరామర్శ

కడియం, మార్చి 30 (జనస్వరం) : ఆకస్మికంగా మృతి చెందిన కడియం మండలం పొట్టిలంక మాజీ ఎంపీటీసీ సభ్యుడు కొత్తపల్లి చంటిబాబు కుటుంబాన్ని సోమవారం పలువురు ప్రముఖులు పరామర్శించారు. తొలుత చంటిబాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. అలాగే కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. పరామర్శించిన వారిలో ఆల్ ఇండియా నర్సరీమెన్ మాజీ అధ్యక్షుడు పల్ల సుబ్రహ్మణ్యం, వైసీపీ నాయకులు గిరజాల బాబు, యాదల స్టాలిన్, ఈలి సుబ్రహ్మణ్యం, తోకల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

See also  వైసీపీ పార్టీ తీరును నిరసిస్తూ టీడీపీ దీక్షకు మద్దతు తెలిపిన బొలిశెట్టి శ్రీనివాస్