
4 లక్షల రూపాయల విలువ గల మాస్కులను 8 గ్రామాలకు పంచిన జనసైనికులు
ఈ కరోనా మహమ్మారి ప్రపంచాన్ని మొత్తం అతులాకుతులం చేసింది. ఈ కరోనా మహమ్మారి బారి నుంచి రక్షించుకోవాలంటే మనం తప్పనిసరిగా మాస్కులు ధరిస్తూ, సామాజిక దూరం పాటించాలి. ఈ సమాయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చిన జనసేవ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఇంకా సేవ చేస్తూనే ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండల పరిధిలో జనసేన పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున జనసేవా కార్యక్రమాలు చేపట్టింది. ఎన్.ఆర్.ఐ. జనసేన విభాగం స్థానిక జనసేన నాయకుల భాగస్వామ్యంలో 8 గ్రామాల్లో ఇంటింటికీ మాస్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్ఫూర్తితో చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా మొదట 5 గ్రామాల పరిధిలో 15 వేల మందికి రెండు లేయర్ల మాస్కులు పంపిణీ చేయాలని నిర్ణయించారు. అయితే ఆ కార్యక్రమాన్ని 8 గ్రామాలకు విస్థరించారు. మొత్తం రూ. 4 లక్షల వరకు ఖర్చు చేసి ప్రత్యేకంగా ఈ మాస్కులు తయారు చేయించారు. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో కరోనా వ్యాప్తి ఉదృతంగా ఉండడం, అదే సమయంలో ఇంటింటికీ మాస్కులు పంపిణీ చేస్తామన్న ప్రభుత్వ హామీ కేవలం హామీగా మిగిలిపోవడంతో, మండల పరిధిలోని 8 గ్రామాల్లో ప్రతి ఒక్కరికీ మాస్కులు పంపిణీ చేశారు. ఫిరంగిపురం, ఎర్రగుంట్లపాడు, కండ్రిక, 113 తాళ్లూరు, తకేళ్లపాడు, నుదురుపాడు, బేతపూడి, గరుడాచలపాలెం తదితర గ్రామాల్లో ఇంటింటికీ, ప్రతి ఒక్కరికీ మాస్కులు అందచేశారు. ఫిరంగిపురంలో కార్యక్రమాన్ని ప్రారంభించి కోవిడ్ 19 నిబంధనలకు లోబడి గ్రామాల వారీగా జనసైనికులకు పంపిణీ చేసే బాధ్యతను అప్పగించారు. స్థానికంగా మాస్కుల లభ్యత తక్కువగా ఉన్న నేపధ్యంలో స్థానికులు వర్షంలో కూడా మాస్కులు స్వీకరించేందుకు కార్యక్రమం పెట్టిన ప్రాంతానికే తరలివచ్చారు. కార్యక్రమానికి స్థానిక జనసేన శ్రేణులతో పాటు ఎన్.ఆర్.ఐ. వర్జీనియా బృందం, ఫిరంగిపురం మండల ఎన్.ఆర్.ఐ. బృందం సభ్యులు వెంకట్ వానరాసి (వర్జీనియా), తడవర్తి కృష్ణ (వర్జీనియా), చక్కా జనార్ధన్ (వాషింగ్టన్), చెమిటికంటి రవిసాయితేజ (ఇండియానా), మండవ రాము (మిచిగాన్), రఘు వానరాసి(మలేషియా)లు తమవంతు సహకారం అందించారు. స్థానిక జనసేన నాయకులు తడవర్తి కేశవ, ఏపూరి పూర్ణ, బంధనాదం జ్యోతి తదితరుల నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది.









