క్షేత్ర స్థాయిలో బలోపేతం చేస్తూ జనసేనానికి అండగా ఉందాం

జనసేనాని

          సర్వేపల్లి ( జనస్వరం ) : నియోజకవర్గంలోని సర్వేపల్లి గ్రామంలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయం నందు శనివారం విలేకరుల సమావేశం నిర్వహించిన సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు. బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజాప్రయోజనాలు దృష్ట్యా ఆయన రాజకీయ షణ్ముఖ వ్యూహంలో అడుగులు వేస్తున్నారని అన్నారు. ఆయన మాటని సిరసావహిస్తూ సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆయన అడుగుజాడల్లో నడుస్తామని, ఆయన ఏ నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అన్నారు. క్రమశిక్షణతో పార్టీని బలోపేతం చేసే దానికి మా వంతు మేం కృషి చేస్తామని అన్నారు.  ఈ కార్యక్రమంలో స్థానికులు పినిశెట్టి మల్లికార్జున్, శ్రీహరి, నవీన్, రహీం, అక్బర్, చిన్నా, రహమాన్ తదితరులు పాల్గొన్నారు.

See also  నర్సింగ్ కాలేజీలో ఆత్మహత్యకు గురైన వర్షిని కుటుంబాన్ని పరామర్శించిన పూల శివప్రసాద్