తిరుపతి : న్యాయ పోరాటం చేస్తున్న FNO, MNO, కార్మికులను వారికి మద్దతు తెలిపిన జనసేన నాయకులను అన్యాయంగా అరెస్టు చేసిన పోలీసులు

తిరుపతి ( జనస్వరం ) : తిరుపత కొద్ది రోజులుగా ఉద్యోగాల నుంచి తొలగించిన FNO, MNO కార్మికులు మా ఉద్యోగాలు మాకు తిరిగి ఇప్పించండి మా కుటుంబాలని ఆదుకోండి అని న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ తరుణంలో జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్  వారికి మద్దతు తెలిపి, నిరసనలో పాల్గొన్న జనసేన నాయకులు పట్టణ అధ్యక్షులు రాజారెడ్డి, మరియు రాజేష్ యాదవ్, బాబ్జి, హేమకుమార్, అమృత, కీర్తన, మునస్వామి, లను దౌర్జన్యంగా అరెస్టు చేసారు. కిరణ్ రాయల్ మాట్లాడుతూ అధికార పార్టీ యొక్క నిజస్వరూపం మరొక్కసారి నిరూపించుకోవడం జరిగిందని, ఇలాంటి అరెస్టు చేయడం చాలా బాధాకరం వెంటనే మా నాయకులను కార్మికులను రిలీజ్ చేయాలని కోరారు. న్యాయపరమైన పోరాటం చేస్తున్న వారిని ఉద్యోగాల్లోకి తిరిగి తీసుకోవాలి లేనట్లయితే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే దానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 

See also  అవనిగడ్డ సభ తరువాత ఎర్రగడ్డకు క్యూ కట్టిన వైసీపీ నేతలు