చిట్వేలి కాపు సంక్షేమ యువసేన ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో ఆర్.ఐ సునీల్ గారికి వినతిపత్రం

చిట్వేలు

                        రాష్ట్ర ప్రభుత్వం కాపు కార్పొరేషన్ కొరకు కేటాయించిన నిధులు సక్రమంగా కాపుల అభివృద్ధి కొరకే వినియోగించాలని, 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలలోపు సుమారు 20 లక్షల మంది కాపు మహిళలు ఉన్నారని అంచనా. వారిలో 3 లక్షల మందికి సంవత్సరానికి 15 వేలు చొప్పున చెల్లించి కాపులను ఉద్ధరించినట్లు ప్రచారం చేసుకోవడం వింతైన చర్య అని జనసేన నాయకులు అన్నారు. ఆలాగే E.W.S ద్వారా కేంద్రం ప్రభుత్వం కేటాయించిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు కేటాయించాలని రాష్ట్ర కాపు సంక్షేమ సేన అధ్యక్షులు చేగొండి హరిరామ జోగయ్య , కాపు సంక్షేమ యువసేన రాష్ట్ర అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణ ప్రసాద్ గారి ఆదేశాల మేరకు చిట్వేలి మండల కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో ఆర్.ఐ సునీల్ గారికి వినతిపత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాపు సంక్షేమ నాయకులు మాదాసు నరసింహ, కాపు సంక్షేమ యువసేన చిట్వేలి మండలం వైస్ ప్రెసిడెంట్ నానబల మహేంద్ర, జనరల్ సెక్రెటరీ పగడాల శేషాద్రి, సెక్రెటరీ యెద్దల చెంగల్రాయుడు, తదితరులు పాల్గొన్నారు. 

See also  నెల్లూరు పట్టణ 1 వ డివిజన్ యువత చేరిక జనసేన పార్టీలోకి చేరిక