ఒమిక్రాన్ పై ప్రజలకు అవగాహన కల్పించాలి : జనసేన మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్

ఒమిక్రాన్

  ఎమ్మిగనూరు, (జనస్వరం) : భారతదేశంలో రోజు రోజుకు పెరుగుతున్న ఒమిక్రాన్ కేసుల పై ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ప్రజలకు ప్రభుత్వ అధికారులు అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాహుల్ సాగర్ మాట్లాడుతూ మాట్లాడుతూ గత నాలుగైదు రోజుల్లోనే ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరిగిందని ఒమిక్రాన్ వైరస్ పై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని దీనికి తోడు ఎమ్మిగనూరు నియోజకవర్గం నందు ఎక్కువ శాతం ప్రజలు కరోనా నిబంధనలను పక్కన పెట్టి మాస్కులు ధరించకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నారని ఇలా చేయడం వల్ల వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

See also  మరలా నిన్ను ఎందుకు నమ్మాలి జగన్ - అవగాహన కార్యక్రమం