
IIIT ప్రవేశ పరీక్షలో రాష్ట్ర 7 వ ర్యాంకును సాధించిన జ్ఞానేశ్వర్ ను అభినందించిన పెందుర్తి జనసేన నాయకులు
విశాఖపట్నం 88 వార్డ్ నరవ గ్రామం, పెందుర్తి నియోజకవర్గం IIIT ప్రవేశ పరీక్షలో 96 మార్కులు సాధించి రాష్ట్రంలో 7 ర్యాంకు, విశాఖపట్నం జిల్లాలో 1 ర్యాంకు సాధించిన జేరిపోతుల జ్ఞానేశ్వర్ S/o పోలరావు ని జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి శ్రీ వబ్బిన జనార్ధన శ్రీకాంత్ సత్కరించి అభినందించారు. భవిష్యత్తులో ఉన్నతమైన శిఖరాలను ఆదిరోహించి, కుటుంబానికి మన నరవ గ్రామానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరడంతో పాటు, విజయానికి మూలకారణమైన తల్లిదండ్రులు ను ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో KR కోర్ అడ్మిన్ నవీన్, మహేష్, శేషు, జన సైనికులు గవర శీను గవర గణేష్, బొబ్బర శ్రీను, ప్రవీణ్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.








