స్వప్నకు ఆర్థిక సాయం అందజేసిన పవన్‌ కళ్యాణ్‌ అభిమాని పోలిశెట్టి నరేష్

          ఖమ్మం జిల్లా ఏన్కూర్‌ గ్రామానికి చెందిన గాయత్రి హెల్పింగ్‌ హాండ్స్‌ లో గ్రామీణ వైద్యుడు నరేష్‌ అందాల వలసకు చెందిన స్వప్న చిన్నతనంలోనే ఓ ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయింది. తన తల్లిదండ్రులు ఇద్దరూ కూడా వ్యాధిగ్రస్తులు అవ్వడంతో తానే తన కుటుంబాన్ని గాజుల దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుంది. కరోనా కాటుకు తన వ్యాపారం నడవక ఇబ్బందులు పడుతున్న ఆమె సామాజిక సేవ చేసే పవన్‌ కళ్యాణ్‌ అభిమాన సంఘానికి గోడు విన్నవించుకుంది. ఇది తెలుసుకున్న పవన్‌ కళ్యాణ్‌ అభిమాని గ్రామీణ వైద్యుడు నరేష్‌ హెల్పింగ్‌ హాండ్స్‌ బృందాన్ని స్పందించి. రూ. 10వేలు116 లు ఆర్థిక సాయం ఆన్‌ లైన్‌ ద్వారా అందజేశారు. ఈ ఆర్థిక సాయం అందుకున్న స్వప్న గత నెలలో నరేష్‌ జన్మదిన సందర్భంగా తన ముఖచిత్రాన్ని తన కాళ్ళ వేళ్ళతో వేసి తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసింది.

See also  కదిరి టౌన్ 34వ వార్డులో జనసేనపార్టీ కమిటీ ఎంపిక

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి