గ్రామ సమస్యలపై ఆరా తీసిన పంతం నానాజీ

పంతం నానాజీ

         కాకినాడ ( జనస్వరం ) :  కరప మండలం చిన కొత్తూరు గ్రామంలో గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు అల్లు గంగాద్రి ఆధ్వర్యంలో జనం కోసం పవన్ – పవన్ కోసం మనం కార్యక్రమం  నిర్వహించారు. ఇంటింటికి పాదయాత్ర చేస్తూ సమస్యలు తెలుసుకుంటూ ఉన్న జనసేన పార్టీ PAC సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ.  గ్రామంలో పర్యటన చేస్తున్న నానాజీగారికి మంచి నీరు సరైన సమయానికి రావడం లేదని, అధికారులకి చెప్పిన పట్టించుకోవడం లేదని, డ్రైనేజీ లు లేవని, వీధి దీపాలు సరిగా వెలగడం లేదని, తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు అల్లు గంగాద్రి,చింత వెంకట్, బండారు మణికంఠ, రెడ్డి రాజు, సంజయ్, గోపి , బోగి బోగిరెడ్డి కొండబాబు, బండారు మురళి, గంగాధర్, యాళ్ల పండు, వెంకటేశ్వర్లు, రమణ, శిరంగు శ్రీనివాస్, తాటికాయల వీరబాబు, కరెడ్ల గోవింద్, రెడ్డిపల్లి కిషోర్ తదితరులు పాల్గొన్నారు

See also  దివ్యాంగులకు ట్రై సైకిల్లు ఇవ్వాలి : జనసేన నాయకులు గోగన ఆదిశేషు