పలమనేరు – కైగల్ గ్రామంలో100 గృహాల పైన జనసేన జెండాను ఆవిష్కరించిన జనసేన నాయకులు

పలమనేరు

      పలమనేరు ( జనస్వరం ) :  బైరెడ్డి పల్లి మండలం, కైగల్ గ్రామంలో జిల్లా అద్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ గారి సూచన మేరకు పసుపులేటి దిలీప్, కైగాల్ కుమార్ గార్ల అధ్వర్యంలో జనసేన జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం  100 గృహాల పైన జెండాలను ఎగురవేశారు. వైసీపీ, టీడీపీ పార్టీల నుండి పెద్ద ఎత్తున జనసేన పార్టీలో చేరారు. జనసేన నాయకులు మాట్లాడుతూ రాయలసీమలో ఇపుడిపుడే జనసేనపార్టీ బలోపేతం అవుతోందని, ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. అధికారం ఇచ్చినా నిలబెట్టుకోలేని టీడీపీని ప్రజలు విస్మరించారు. మార్పు కోసం జనసేనపార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బైరెడ్డిపల్లి మండల అధ్యక్షులు చైతన్య, దినేష్, రాజు, కృష్ణ, బాబు, కైగల గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.

See also  గాతపాడు గ్రామంలో రోడ్డు సదుపాయం కల్పించాలి? అరకు జనసేన నాయకులు