20 వ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన ఇంఛార్జి వినుత కోటా ఇంటింటికీ ప్రచారం

   శ్రీకాళహస్తి ( జనస్వరం ) : శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి వినుత కోటా కలవగుంట పంచాయతీ లోని, కలవగుంట, కోట, గుండ్ల పల్లి గ్రామాలలో ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి మినీ మానిఫెస్టోను ప్రజలకు వివరించడం జరిగింది. మరియు ప్రజలకు ఈ వైసీపీ ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మదు రెడ్డి చేస్తున్న అవినీతి, అక్రమాలను, దోపిడీలను వివరించడం జరిగింది. రానున్న ఎన్నికల్లో జనసేన – టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంను ఆశీర్వదించాలని, తద్వారా రాష్ట్ర అభివృద్ది కి సహకరించాలని కోరడం జరిగింది. గ్రామంలో బస్ సౌకర్యం లేదు, డ్రైనేజ్ కాలువలు, CC రోడ్లు, స్ట్రీట్ లైట్లు సమస్యలు గ్రామస్థులు తెలిపారు. ప్రభుత్యం అధికారంలోకి వచ్చిన 3-6 నెలల్లో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు దండి రాఘవయ్య, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, నాయకులు తోట గణేష్, రవి కుమార్ రెడ్డి, శారద, పేట చంద్ర శేఖర్, చిరంజీవి, సురేష్, మునయ్య, గురవయ్య, దినేష్, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

See also  మంత్రి శంకర్ నారాయణపై ఫైర్ అయిన జనసేన రాప్తాడు ఇంఛార్జ్ పవన్ కుమార్