పలుమార్లు సమస్యలు విన్నవించినా పట్టించుకోని అధికారులు

పలుమార్లు సమస్యలు విన్నవించినా పట్టించుకోని అధికారులు.

టెక్కలి ( జనస్వరం) : తమ నియోజకవర్గంలోని సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని టెక్కలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ కణితి కిరణ్ ధ్వజమెత్తారు. కన్నెవలస మరియు చుట్టుగుండం రెండు గ్రామాల మధ్య వంతెన పూర్తిగా దెబ్బతిన్నదని, కొత్త వంతెన నిర్మించాలని పలుమార్లు అధికారులను ఆశ్రయించామన్నారు. ఈ గ్రామానికి అంబులెన్సులు రావాలన్నా కూడా చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉందన్నారు.చుట్టుగుండం గ్రామంలో కూడా తాగడానికి సరైన నీటి వసతి లేదని, డ్రైనేజి వ్యవస్థ లేకపోవడంతో ఈ వర్షాకాలంలో గ్రామం అంతా నీటితో నిండిపోయే పరిస్థితి అని అన్నారు. గ్రామంలో వీధి లైట్లు లేకపోవడం వలన చీకటిలో బ్రతకాల్సి వస్తోందని, అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారికి స్పందన కార్యక్రమం ద్వారా తెలియజేశామన్నారు.

See also  ఎస్సీ, ఎస్టీలకు నోట్లో మట్టికొడతారా..? : జనసేనపార్టీ నాయకులు ఆదాడ మోహనరావు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి