పక్షవాతం వ్యాధితో బాధపడుతున్న కుటుంబాన్ని ఆదుకున్న NRI జనసేన వీరమహిళ బూరకల గీతాంజలి

వీరమహిళ

        నెల్లూరు ( జనస్వరం ) : మర్రిపాడు మండల పరిధిలోని పటమటనాయుపల్లి గ్రామం ST కాలనీలో  అనారోగ్యంతో బాధపడుతున్న మణి కుటుంబానికి చెందిన తండ్రి కొడుకులిద్దరూ పక్షవాతంతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని స్థానిక జనసైనికుడు చిన్నా జనసేన NRI జనసేన వీరమహిళ బూరకల గీతాంజలి దృష్టికి తీసుకెళ్ళాడు. వెంటనే స్పందించిన  గీతాంజలి నెలకి సరిపడా నిత్యావసర సరుకులు బియ్యం బస్తా, 14 రకాలు నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. చిన్నా జనసేన మాట్లాడుతూ ఎవరికి ఏం కష్టం వచ్చినా జనసేన పార్టీ అండగా ఉంటుందని అన్నారు. అలాగే ఈ విషయం తెలుసుకొని మానవతా హృదయంతో స్పందించిన గీతాంజలి గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి వనం పవన్, మర్రిపాడు మండల నాయకులు చిన్నా జనసేన, మండల ప్రచారకార్యదర్శి ఉదయ్, మణికంఠ, గంటా అంజి, స్థానికులు పాల్గొని విజయవంతం చేశారు. 

See also  కౌలు రైతులకు అండగా పవన్ కళ్యాణ్...గోడపత్రికలను ఆవిష్కరించిన యు.పి.రాజు