నిడమర్రు జనసేన పార్టీ మండల అధ్యక్షుడిగా నిమ్మల దొరబాబు

     నిడమర్రు, (జనస్వరం) : జనసేనపార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంతో పాటు పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త నిబద్దతతో పనిచేయాలని ఉంగుటూరు నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ లక్ష్మీనారాయణ, ఫౌండేషన్ చైర్మన్ పత్సమట్ల ధర్మరాజు అన్నారు. బుధవారం ఉంగుటూరు నియోజకవర్గం లోని మండల జనసేన పార్టీ అధ్యక్షుడిగా నిమ్మల దొరబాబును నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ధర్మరాజు మాట్లాడుతూ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు విద్యా వైద్యం గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కలిసికట్టుగా పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి గంగుమోలు చిన్న రత్తయ్య, ఉంగుటూరు నియోజకవర్గ జనసేన నాయకులు వంగా రఘు, చింతలపాటి బాసి రాజు, బెతు మురళి, తోట పవన్, తానేటి జోగేశ్వరరావు, నిడమర్రు గ్రామ కమిటీ సభ్యులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

See also  పవన్ కళ్యాణ్ పర్యటన అంటే వైసీపీ నాయకులకు భయం పట్టుకుంది : జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి