MY FIRST VOTE FOR JANASENA కార్యక్రమం

  మదనపల్లి ( జనస్వరం ) : జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ మై ఫోర్స్ మహేష్ ఆధ్వర్యంలో మై ఫస్ట్ ఓట్ ఫర్ జనసేన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలోని ప్రైవేట్ కళాశాలలో విద్యార్థులతో కలిసి 18 ఏళ్ల నిండిన ప్రతి ఒక్కరు ఓటు రిజిస్టర్ చేసుకొని బాధ్యతయుతమైన పౌరుడిగా ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మై ఫోర్స్ మహేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో దేశంలో నీతి నిజాయితీ సిద్ధాంతంతో రాజకీయం చేసే ఏకైక నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయడంలో యువత ముఖ్య పాత్ర పోషించాల్సిన తరుణం ఆసన్నమైంది కావున 18 నిండిన ప్రతి ఒక్కరు ఓటు రిజిస్టర్ చేసుకొని జనసేన పార్టీకి మీ అమూల్యమైన ఓటు వేసి జనసేన పార్టీ గెలుపు కృషి చేయాల్సిందిగా తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మా మొదటి ఓటు జనసేన పార్టీకే అని తెలియజేసి మై ఫస్ట్ ఓట్ ఫర్ జనసేన అనే ప్లక్కార్లతో పవన్ కళ్యాణ్ గారికి తమ మద్దతుని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ విద్యార్థి విభాగం నాయకులు పవన్, నాగేంద్ర, వెంకటేష్, కళ్యాణ్, సయ్యద్ తదితరులు పాల్గొన్నారు.

See also  అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించిన గుడివాడ జనసైనికులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి