నా నమ్మకం జనమే కాదు జగనన్న… నీ అమ్మకం జనమే జగన్

     తిరుపతి ( జనస్వరం ) : నిజం ఎప్పటికైనా గెలిచి తీరుతుందన్నారు జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ అన్నారు. శుక్రవారం శ్రీకాళహస్తిలో జరిగిన “నిజం గెలవాలి” బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, ఆ పాలనకు చరమగీతం పాడేందుకే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఏకమయ్యారన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన వెంటనే రాష్ట్ర ప్రయోజనాలకు దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ అండగా నిలిచారన్నారు. జగన్ దగ్గర ధనం ఉంది కానీ జనం లేరన్నారు. ఎప్పుడూ రాజకీయాలపై మాడ్లాడని భువనేశ్వరి.. నిజం గెలవడం కోసం ఊరూర తిరుగుతున్నారన్నారు. తప్పకుండా ఆమె శ్రమ వృధా కాదని తెలిపారు. మా నమ్మకం నువ్వే జగన్ అంటూ వైసిపి ప్రచారం చేస్తోందన్నారు. కానీ “నీ అమ్మకం మేమే జగన్” అని వైసిపి నినాదానికి ఆయన కొత్త భాష్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు & అనుబంధ విభాగాల నాయకులు, ఇన్చార్జిలు, మండల అధ్యక్షులు, వీర మహిళలు పాల్గొన్నారు.

See also  రాష్ట్రములో రాక్షస పాలన సాగుతోంది : జనసేనపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి