Logo
Date of Publish : 27 October 2023, 11:10 pm
Editor : Sake Naresh

నా నమ్మకం జనమే కాదు జగనన్న… నీ అమ్మకం జనమే జగన్

     తిరుపతి ( జనస్వరం ) : నిజం ఎప్పటికైనా గెలిచి తీరుతుందన్నారు జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ అన్నారు. శుక్రవారం శ్రీకాళహస్తిలో జరిగిన "నిజం గెలవాలి" బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, ఆ పాలనకు చరమగీతం పాడేందుకే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఏకమయ్యారన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన వెంటనే రాష్ట్ర ప్రయోజనాలకు దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ అండగా నిలిచారన్నారు. జగన్ దగ్గర ధనం ఉంది కానీ జనం లేరన్నారు. ఎప్పుడూ రాజకీయాలపై మాడ్లాడని భువనేశ్వరి.. నిజం గెలవడం కోసం ఊరూర తిరుగుతున్నారన్నారు. తప్పకుండా ఆమె శ్రమ వృధా కాదని తెలిపారు. మా నమ్మకం నువ్వే జగన్ అంటూ వైసిపి ప్రచారం చేస్తోందన్నారు. కానీ "నీ అమ్మకం మేమే జగన్" అని వైసిపి నినాదానికి ఆయన కొత్త భాష్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు & అనుబంధ విభాగాల నాయకులు, ఇన్చార్జిలు, మండల అధ్యక్షులు, వీర మహిళలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com