ముద్రగడ మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు: మంద కృష్ణ మాదిగ

– ముద్రగడ సమాధి వద్ద మంద కృష్ణ మాదిగ నివాళి
– పేదల పక్షాన పోరాడిన మహానేత ముద్రగడ: మంద కృష్ణ
– సామాజిక ఉద్యమాలకు దిక్సూచి ముద్రగడ పద్మనాభం
– తెలుగు నేల కోల్పోయిన ఉద్యమ యోధుడు ముద్రగడ
– ముద్రగడ కుటుంబాన్ని పరామర్శించిన మంద కృష్ణ మాదిగ
– కాపు ఉద్యమ చరిత్రలో చెరగని ముద్ర ‘ముద్రగడ’ది
– పదవుల కంటే సమాజానికే ప్రాధాన్యం ఇచ్చిన నాయకుడు

కిర్లంపూడి, జూలై 23 (జనస్వరం): కాకినాడ జిల్లా కిర్లంపూడిలో మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత దివంగత ముద్రగడ పద్మనాభం సమాధి వద్ద ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ నివాళులర్పించారు. ముద్రగడ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం, ఆయన కుమారులు, ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి ముద్రగడ గిరిబాబు, బాలులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ, పేద ప్రజల కోసం జీవితాంతం పోరాడిన మహానాయకుడు ముద్రగడ పద్మనాభమని కొనియాడారు. తెలుగు నేలపై సామాజిక ఉద్యమాలకు దిక్సూచిగా నిలిచిన నాయకుల్లో ముద్రగడ ఒకరని, ఆయన మరణం తెలుగు రాష్ట్రాల ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సామాజిక ఉద్యమాలకు పర్యాయపదంగా నిలిచిన కొద్దిమంది మహానుభావుల్లో ముద్రగడ పద్మనాభం పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. వంగవీటి మోహనరంగా హత్య అనంతరం కాపు ఉద్యమాన్ని ముందుకు నడిపించిన మహానేత ముద్రగడేనని గుర్తు చేశారు. రాజకీయ పదవులను పక్కనబెట్టి, తాను నమ్ముకున్న సమాజం కోసం జీవితాంతం పోరాడిన అరుదైన నాయకుడు ముద్రగడ పద్మనాభమని కొనియాడారు. తెలుగు నేలపై ఉద్భవించిన ప్రముఖ సామాజిక ఉద్యమకారుల్లో చరిత్ర సృష్టించిన నాయకుడిగా ఆయన చిరస్థాయిగా గుర్తుండిపోతారని మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు.

See also  పిఠాపురం నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాల ఏర్పాట్ల పర్యవేక్షణ

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి