ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడిగా మూలింటి నారాయణస్వామి నియామకం

   శింగనమల, అక్టోబర్ 27, జనస్వరం :  నియోజకవర్గంలోని గార్లదిన్నె మండలానికి చెందిన కోటంగ గ్రామానికి చెందిన మూలింటి నారాయణస్వామి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ, “పార్టీ నాపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను” అని తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని గుర్తించి గౌరవించడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. అలాగే, ఈ అవకాశం కల్పించిన వైసిపి జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, శింగనమల ఇంచార్జి సాకే శైలజానాథ్, పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మూలింటి నారాయణస్వామి నియామకంతో స్థానిక పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది.

See also  ప్రజల దృష్టిని మరల్చేందుకే జుగుప్సాకర వ్యాఖ్యలు : అనంతపురం జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు లాయర్ జయరామిరెడ్డి 

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి