సొమ్ము ప్రజలది – సోకు ప్రభుత్వానిది? చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత

   మదనపల్లి, (జనస్వరం) : “సొమ్ము ప్రజలది సోకు ప్రభుత్వానిది” అన్నట్లు  మన రాష్ట్రంలో అధికార వైసీపీ ప్రభుత్వ తీరు ఉందని చిత్తూరు జిల్లా జనసేనపార్టీ ప్రధాన కార్యదర్శి దారం అనిత అన్నారు. వాలంటీర్స్ విషయంలో వైసీపీ నాయకులు పరిధులు దాటి మాట్లాడుతున్నారు. విజయసాయి రెడ్డి, హోం మంత్రి తానేటి వనిత పార్టీ కార్యకర్తలకే వాలంటీర్స్ పోస్ట్లు ఇచ్చాం అంటున్నారు. ఇక రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి వారైతే ఒక అడుగు ముందుకు వేసి వాలంటీర్స్ ను మనం ఇష్టమైన వారిని నియమించామని, పార్టీకి వ్యతిరేకంగా ఉంటే తీసేస్తామని, పార్టీ కార్యకర్తలనీ, వాలంటీర్స్ ను గ్రిప్ లో ఉంచుకోమని తమ పార్టీ వారికి సలహాలు ఇస్తున్నారని మండిపడ్డారు. అంబటి రాంబాబు మీ పార్టీ కార్యకర్తలు, మీ పార్టీ కోసం పని చేస్తే మీ పార్టీ ఫండ్ నుండి జీతాలు ఇవ్వండి. ప్రజల ఖజానా నుండి జీతాలేందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. దీనినే సొమ్ము ప్రజలది సోకు అధికార పార్టీదని ఎద్దేవా చేశారు.

See also  రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను, యువత భవిష్యత్తును కాపాడటమే లక్ష్యం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి