గ్రంథాలయాన్ని పట్టించుకోని ఎమ్మెల్యే, అధికారులు

ఎమ్మెల్యే

      బొబ్బిలి ( జనస్వరం ) : బొబ్బిలి నియోజకవర్గంలో ఉన్న ఏకైక గ్రంథాలయంలో నిన్న రాత్రి దొంగతనం జరిగిందని తెలుసుకొని, గ్రంధాలయాన్ని పరిశీలించిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాబు పాలూరు మరియు బొబ్బిలి నాయకులు మరియు వీరమహిళలు. MLA గారు ఇచ్చిన హామీ ప్రకారం కొత్త గ్రంథాలయం ఎలాగూ కట్టలేకపోయారు, కనీసం గ్రంథాలయం మరమ్మత్తులైనా పూర్తి చేసి, చదువరులకు కావలసిన మౌలిక సదుపాయాలు మరియు ఇలా దొంగతనాలకు తావు లేకుండా CCTV కెమేరాలైనా ఏర్పాటు చెయ్యండని స్థానిక MLA శంబంగి చినప్పలనాయుడు గారిని ప్రశ్నించారు.

See also  జీ-20 పేరుతో రూ.87 కోట్ల జీవీఎంసీ నిధులను కాజేస్తున్న కమిషనర్, షాడో మేయర్లు : జనసేన కార్పొరేటర్లు