పండుగ వాతావరణంలో మెగా పేరెంట్స్–టీచర్స్ సమావేశం

యలమంచిలి, జూలై 24 (జనస్వరం): మండలంలోని కొక్కిరపల్లి ఎం.పి.యు.పి. పాఠశాలలో శుక్రవారం ప్రధానోపాధ్యాయుడు కే. విశ్వేశ్వరరావు అధ్యక్షతన మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్‌ను ఘనంగా నిర్వహించారు. ముందుగా తల్లిదండ్రులను లీప్ యాప్‌లో నమోదు చేసి, వారి పిల్లల తరగతి గదులకు తీసుకెళ్లి విద్యార్థుల విద్యా సామర్థ్యాల గురించి ఉపాధ్యాయులు వివరించారు. అనంతరం వివిధ విద్యా సంబంధిత వీడియోలను ప్రదర్శించారు. గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశాలను తల్లిదండ్రులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ‘తల్లికి వందనం’, విద్యా కిట్, మధ్యాహ్న భోజన పథకం (ఎండీఎం), ఆరోగ్య పథకాలు, ఐఎఫ్‌పీ, ఏఐ, ఎఫ్‌ఎల్‌ఎన్, దీక్ష తదితర అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఎన్నారై వేణు పాఠశాల విద్యార్థుల కోసం రూ.50 వేల విలువైన డెస్క్‌టాప్ కంప్యూటర్‌ను బహూకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రామకృష్ణ, మాజీ సర్పంచ్ నరసింగరావు, ఉపాధ్యాయులు ఆకుల పాపాజీరావు, బాబురావు, రమేష్, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

See also  మూలపేట సమస్యలు తీర్చండి : టెక్కలి జనసేన ఇంచార్జ్ కణితి కిరణ్