అగ్ని ప్రమాద బాధితులకి ఆర్థిక సహాయం అందించిన ఎచ్ఛర్ల నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి శ్రీ కాంతి శ్రీ

           శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం జి సిగడం మండలంలోని పాలఖండ్యం పంచాయితీ జగన్నాదపురం గ్రామంలో ఒక నిరుపేద వృద్ధ దంపతులు నివాసం ఉంటున్న పూరిల్లు అగ్ని ప్రమాదం సంభవించింది. ఆస్తి నష్టం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఎచ్చెర్లనియోజకవర్గ జనసేన నాయకులు శ్రీమతి క్రాంతి శ్రీ గారు అగ్ని బాధితులకు పరామర్శించి, కొంత డబ్బును అందజేసి, ఎప్పుడు కష్టం వచ్చినా అందుబాటులో ఉంటానని తెలిపారు. మాట్లాడుతూ అలాగే ప్రతీ బాధితులకు ప్రభుత్వం ఆదుకోవాలని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో దుర్గారావు, కాకర్ల బాబాజీ, జి.సిగడాం మండల జనసైనికులు దినేష్, రాజేష్, నర్సుములు, సాయి, అలాగే పాలఖండ్యం జనసైనికులు పాల్గొన్నారు.

See also  ఒక్క గ్రామ పంచాయతీని కూడా అభివృద్ధి చేయలేని ఉప ముఖ్యమంత్రి ఎందుకు ?

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి