
ఉత్తరాంధ్ర సమస్యలపై జనసేన కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశం
జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివ శంకర్, పర్యావరణ వేత్త, ప్రధాన కార్యదర్శి సత్య బొలిశెట్టి, జనసేన నాయకులు వన్నెంరెడ్డి సతీష్ కుమార్ లను విశాఖపట్నం పార్టీ కార్యాలయంలో నర్సన్నపేట నాయకులు మార్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ సమస్యలపై చర్చించడంతో పాటు, పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేసేందుకుగాను శివ శంకర్ పలు సలహాలు సూచనలు అందించారు. త్వరలోనే నియోజకవర్గంలో నిర్వహించనున్న పలు కార్యాక్రమాలపై దిశా నిర్దేశం చేశారు. నర్సన్నపేట నియోజకవర్గ జనసైనికులతో చర్చాగోష్ఠి నిర్వహించి వారు పలు సమస్యలను చర్చించారు. ఈ కార్యక్రమంలో శివ శంకర్, సత్య బొలిశెట్టితో పాటు నర్సన్నపేట సీనియర్ నాయకులు జయరాం, ఉత్తరాంధ్ర జనసేన పార్టీ సమన్వయకర్త పేడాడ రామ్మోహన్, నర్సన్నపేట జనసైనికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయరాం మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు తానూ ఒక జనసైనికునిగా ప్రతి గ్రామంలో పర్యటించి అక్కడి సమస్యలను అవగాహన చేసుకుంటానన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాల్ని, జనసేన పార్టీ సిద్ధాంతాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు పలు కార్యక్రమాలు రూపకల్పన చేయబోతున్నట్టు ఆయన చెప్పారు. ఉత్తర్రాంధ్ర పార్టీ సమన్వయకర్త రామ్మోహన్ సూచనల మేరకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తామని జయరాం తెలిపారు.









