Logo
Date of Publish : 29 October 2020, 3:21 pm
Editor : Sake Naresh

ఉత్తరాంధ్ర సమస్యలపై జనసేన కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశం

ఉత్తరాంధ్ర సమస్యలపై జనసేన కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశం

            జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివ శంకర్‌, పర్యావరణ వేత్త, ప్రధాన కార్యదర్శి సత్య బొలిశెట్టి, జనసేన నాయకులు వన్నెంరెడ్డి సతీష్ కుమార్ లను విశాఖపట్నం పార్టీ కార్యాలయంలో నర్సన్నపేట నాయకులు మార్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ సమస్యలపై చర్చించడంతో పాటు, పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేసేందుకుగాను శివ శంకర్ పలు సలహాలు సూచనలు అందించారు. త్వరలోనే నియోజకవర్గంలో నిర్వహించనున్న పలు కార్యాక్రమాలపై దిశా నిర్దేశం చేశారు. నర్సన్నపేట నియోజకవర్గ జనసైనికులతో చర్చాగోష్ఠి నిర్వహించి వారు పలు సమస్యలను చర్చించారు. ఈ కార్యక్రమంలో శివ శంకర్, సత్య బొలిశెట్టితో పాటు నర్సన్నపేట సీనియర్ నాయకులు జయరాం, ఉత్తరాంధ్ర జనసేన పార్టీ సమన్వయకర్త పేడాడ రామ్మోహన్, నర్సన్నపేట జనసైనికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయరాం మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు తానూ ఒక జనసైనికునిగా ప్రతి గ్రామంలో పర్యటించి అక్కడి సమస్యలను అవగాహన చేసుకుంటానన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాల్ని, జనసేన పార్టీ సిద్ధాంతాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు పలు కార్యక్రమాలు రూపకల్పన చేయబోతున్నట్టు ఆయన చెప్పారు. ఉత్తర్రాంధ్ర పార్టీ సమన్వయకర్త రామ్మోహన్ సూచనల మేరకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తామని జయరాం తెలిపారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com