రాయదుర్గం నియోజకవర్గంలో పలువురు నాయకులు జనసేన పార్టీలోకి చేరిక

     రాయదుర్గం, (జనస్వరం) : అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం జనసేనపార్టీ ఇంచార్జి మంజునాథ్ గౌడ ఆధ్వర్యంలో బొమ్మనహాళ్ మండలంలోని కలుహాల గ్రామం, బల్లెనగుడ్డం గ్రామాలలో ఇతరపార్టీ నాయకులూ జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. వారందరికీ జనసేనపార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేనపార్టీ ఆశయాలు, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి పార్టీలోకి చేరామన్నారు. అలాగే మంజునాథ్ మాట్లాడుతూ 2024లో జరిగే ఎన్నికల్లో జనసేనపార్టీని గెలిపించి, పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేసుకోవాలని వారికి సూచించారు.  ఈ కార్యక్రమంలో బొమ్మనహాళ్ మండలం అద్యక్షలు శివరాజ్ ఉప అధ్యక్షులు సికిందర్ బాషా, ప్రధాన కార్యదర్శి రమేష్, సుధా, రాయదుర్గం అధ్యక్షులు హర్షవర్ధన్, గుమ్మగట్ట మండల అధ్యక్షలు తిప్పేరుద్ర, జిల్లా సంయుక్తకార్యదర్శి సారంగం మరేష్, రంజిత్ కుమార్, తిప్పేష్, విజయ్, రాజు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

See also  లావేరు మండలంలో జనసైనికులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన జనసేన నాయకురాలు శ్రీ కాంతి శ్రీ గారు